యాదగిరిగుట్ట మండలం రాళ్ళ జనగాం గ్రామానికి చెందిన గూడురు బాల్ రెడ్డి, సుగుణ దంపతుల కొడుకైన మధుకర్ రెడ్డి. చదువు కోసం 14 ఏళ్ళ క్రితమే అమెరికాకు వెళ్ళాడు. అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకొంటూ స్థిరపడిపోయాడు. ఏడేళ్ళ క్రితం భువనగిరికి వచ్చి స్వాతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. మధుకర్ రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఆర్థికంగా మంచిస్థితిలో ఉన్న మధుకర్ రెడ్డికి ఆత్మహత్య చేసుకోవడానికి గల బలమైన కారణాలు తెలియడం లేదు. పైగా ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కూడా తలెత్తినట్టు సమాచారం. దీనిపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.