అధికారంలో ఎవరు ఉంటే వారికి అనుగుణంగా అధికారులు పనిచేయడం సరికాదన్నారు. ఎయిమ్స్, నిఫ్ట్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయని తెలిపారు. హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్ వంటివి ఒకే చోట ఉండాలని విభజన చట్టం సెక్షన్-6లో స్పష్టంగా ఉందన్నారు. ఇకనైనా వైకాపా ప్రభుత్వం పరిపాలనపై దృష్టిపెట్టాలన్నారు.