కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధర... ఎవరికి?

సోమవారం, 16 సెప్టెంబరు 2019 (19:29 IST)
ఉల్లి ధర కన్నీళ్లు పెట్టిస్తోంది. వారం క్రితం 30 రూపాయలుండగా.. ప్రస్తుతం అది 40 నుంచి 50 రూపాయలకు చేరింది. దీనికి కారణం ఉల్లి దిగుమతి తగ్గిపోవడమేనంటున్నారు వ్యాపారులు.

గత వారం క్వింటాల్‌ ఉల్లిగడ్డ… 2500 నుంచి 3వేల రూపాయలు ఉండేది. కానీ శనివారం ఒక్కసారి ధర పెరిగిపోయింది. హైదారాబాద్‌ హోల్‌ సెల్‌ మార్కెట్‌లో 3700 రూపాయలకు చేరింది.
 
ఉల్లికి డిమాండ్ పెరిగిన కారణంగా మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, ఏపీ,తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు భారీగా ఉల్లిగడ్డ చేరుతోంది. తెలంగాణకు దాదాపు 60 శాతం ఉల్లిపాయ  మహరాష్ట్ర నుంచే వస్తుంది. మిగిలింది ఆంధ్రప్రదేశ్‌ నుంచి వస్తుంది.
 
తాజాగా ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు తొలగించడంతో వ్యాపారులంతా ఉల్లిని డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర ఉల్లిగడ్డకు విదేశాల్లో భారీ డిమాండ్‌ ఉంది. దీంతో హైదరాబాద్‌కు అవసరమైన ఉల్లి రావడం లేదు.

రోజుకు 120 లారీలకుపై గా వచ్చే ఉల్లి.. ఇప్పుడు కేవలం 80 లారీలకే పరిమితమైంది. విదేశాల్లో ఎక్కువ ధర వస్తుందన్న ఆశతో వ్యాపారులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఉల్లిధరలు మరింత పెరిగే అవకాశం  ఉందంటున్నారు వ్యాపారులు.

ఉల్లి ధరలు మరింత పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నాయి విపక్షాలు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై శ్రద్ధ పెట్టి.. ధరలు తగ్గించే మార్గాలు చూడాలని కోరుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు