రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ

సోమవారం, 9 మార్చి 2020 (16:23 IST)
ఏపీ నుంచి తమ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు, రాంకీ సంస్థ అధినేత అయోధ్య రామిరెడ్డికి, నాల్గో సీటును మరో ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానికి కేటాయించారు.

కాగా, మోపిదేవి, సుభాష్ చంద్రబోస్ లు ఎమ్మెల్సీలుగా ఎన్నికై మంత్రులుగా కొనసాగుతున్నారు. ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో వీరిని రాజ్యసభకు పంపుతున్నట్టు సమాచారం.
 
జగన్‌తో సుబ్బరామిరెడ్డి కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను కలవడానికి సీఎం క్యాంపు ఆఫీసుకి కాంగ్రెస్ నేత సుబ్బరామిరెడ్డి వెళ్లారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఆసక్తి రేపుతోంది.

వచ్చేనెలతో సుబ్బరామిరెడ్డి రాజ్యసభ పదవీకాలం ముగుస్తుంది. దీనిపైనే ఆయన చర్చలు జరిపారా అన్నదానిపై రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు