ఇద్దరు పిల్లలతో బ్యాంకుకు వచ్చిన మహిళ బ్యాంకులో చోరీ...

గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:01 IST)
ఏపీ ఆర్థిక రాజధానిగా ఉన్న విజయవాడ గన్నవరం ఆంధ్రా బ్యాంకులో తాజాగా చోరీజరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి బ్యాంకుకు వచ్చిన ఓ మహిళ బ్యాంకులో చోరీ చేసి పారిపోయింది. ఈ చోరీకి పాల్పడిన మహిళ వివరాలను సీసీ పుటేజ్ ఆధారంగా స్థానిక పోలీసులు సేకరిస్తున్నారు. 
 
గురువారం ఉదయం ఇద్దరు పిల్లలతో ఓ మహిళ బ్యాంకుకు వచ్చింది. ఈ క్రమంలోనే బ్యాంకుకు వచ్చిన వేరే మహిళ బ్యాగు నుంచి 65 వేల రూపాయల డబ్బును కాజేసి ఇద్దరు పిల్లలతో కలిసి పరారైంది. గన్నవరం పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు