అవి భోగి మంటలు .. కారాదు అమరావతి చితి మంటలు

బుధవారం, 13 జనవరి 2021 (09:40 IST)
భోగి పండుగను పురస్కరించుకుని అమరావతిలోని తుళ్లూరులో ఈరోజు ఉదయం అన్ని రాజధాని గ్రామాల రైతులు, మహిళలు భోగి మంటలు వేశారు.

నేటి భోగి మంటలు కారాదు.. అమరావతి చితి మంటలు పేరుతో భోగి మంటలు అంటూ రాజధాని రైతులు భోగి మంటలు వేశారు. అనంతరం రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇచ్చిన జిఒలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు.

రైతులను విభజించి పాలించాలని కొన్ని గ్రామలను తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలలో కలుపుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఆర్డినెన్స్‌ కాపీలను అమరావతి రైతులు భోగి మంటల్లో వేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు