ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ముసలి మడుగు, గుమ్మడాపురం బీట్లలో 100 మందితో పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పులి కోసం వేట సాగుతోంది. మరోవైపు కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం బీట్ పరిధిలో నాలుగు పిల్లల తల్లి పులిని అటవీశాఖ అధికారులు గుర్తించి 108వ పులిగా గుర్తించారు.
తల్లి పులి వయస్సు దాదాపు 8 ఏళ్లు ఉంటుందని, పులి నంబర్ 108గా గుర్తించామని అధికారులు తెలిపారు. పిల్లలు కనిపించిన ప్రాంతంలో తల్లి పులి గర్జనలు వినిపించాయని, వాటి కోసం గాలిస్తున్నామని సిబ్బంది వెల్లడించారు.