తితిదేలో మరో ఆభరణాల స్కామ్

మంగళవారం, 27 ఆగస్టు 2019 (15:00 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో కలకలం చోటు చేసుకుంది. తితిదే ట్రెజరీలో ఉన్న 5.4 కిలోల వెండి కిరీటం మాయమైంది. దీంతో పాటు రెండు ఉంగరాలు కూడా మాయమైనట్లు సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై తితిదే ఏఈవో శ్రీనివాసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అతడి జీతం నుంచి రికవరీ చేసుకున్నారు
 
ఆలస్యంగా వెలుగు చూసిన 2018 నాటి ఘటన. తిరుపతిలోని ట్రెజరి నుంచి 5.4 కే.జి ల వెండి కీరిటం, రెండు బంగారు ఉంగారాలు, రెండు బంగారు నక్లెస్‌లు మాయమయ్యాయి. దీనికి సంబంధించి ఏఈఓ శ్రీనివాసులును బాధ్యులును చేస్తూ జీతం నుంచి ప్రతి నెల 30 వేల రూపాయలు రికవరి చేస్తూన్న ఆర్థిక శాఖాధికారి బాలాజి. 
 
తప్పు చేసివుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోకూండా, రికవరి చేస్తూండటంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ప్రయత్నం అంటున్న భక్తులు. ట్రెజరీలో షార్టేజ్, ఎక్సెస్ అంటూ నిబంధనలపై విమర్శలు వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు