తిరుమల ఎల్ఈడీ స్క్రీన్‌పై సినిమా పాట

ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (09:44 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల కొండపై ఉండే ఎల్ఈడీ స్క్రీన్‌లపై శ్రీవారికి సంబంధించిన పాటలు, వీడియోలు మాత్రమే ప్రసారం చేయాల్సివుంది. కానీ, ఉన్నట్టుండి తాజాగా ఓ సినిమా పాట ప్రత్యక్షమైంది. దీన్ని చూసిన శ్రీవారి భక్తులు విస్తుపోయారు. ఇది వైరల్ కావడంతో తితిదే ఈవో ధర్మారెడ్డి స్పందించారు. 
 
బ్రాడ్‌కాస్ట్ ఉద్యోగి స్నేహితుడి కారణంగా ఈ సమస్య తలెత్తినట్టు చెప్పారు. విచారణ అనంతరం బాధ్యుతలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్ఈడీ స్క్రీన్‌పై సినిమా పాటలు ప్రసారం కావడాన్ని తొలుత సాంకేతికంగా సమస్యగా భావించారు. అయితే, ప్రాథమిక విచారణ తర్వాత బ్రాడ్‌కాస్టింగ్ ఉద్యోగి స్నేహితుడే ఇందుకు కారణని తేలింది. 
 
ఉద్యోగి తన స్నేహితుడిని బ్రాడ్‌కాస్ట్ గదిలోకి తీసుకెళ్లాడని, ఆ తర్వాత అతని స్నేహితుడిని అక్కడే ఉంచి వేరే పనిపై వైకుఠం-2 వరకు ఉద్యోగి వెళ్లినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో బ్రాడ్‌కాస్ట్ గదిలో ఉన్న అతడి స్నేహితుడు అక్కడ ఉన్న రిమోట్‌తో ఆపరేట్ చేయడంతో సినిమా పాటలు ప్రసారమైనట్టు ధర్మారెడ్డి వివరించారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన  వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు