టీటీడీలో ఉద్యోగాలు.. మొత్తం 56 పోస్టుల భర్తీ

శుక్రవారం, 27 అక్టోబరు 2023 (19:10 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 56 ఏఈఈ, ఏఈ, ఏటీవో వంటి ఖాళీలను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 42 ఏళ్లు మించరాదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. 
 
విద్యార్హతల విషయానికొస్తే బీఈ, బీటెక్‌, ఎల్‌సీఈ-ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 23 చివరితేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం తిరుమల దేవస్థానం వెబ్ సైట్‌ను పరిశీలించవచ్చు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు