ఇందులోభాగంగా తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఇరు పార్టీ నేతల సమన్వయ సమావేశం జరిగింది. ఉప ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
ఇందులో సోము వీర్రాజు మాట్లాడుతూ, ఈ రాష్ట్రానికి అధిపతిగా.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కావాలన్నారు. అలాగే, పవన్ కళ్యాణ్‌కు సముచిత గౌరవం ఇవ్వాలని నేరుగా ప్రధాని నరేంద్ర మోడీనే తమకు సూచించారని వెల్లడించారు.
ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, అటు ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలను ఎండగట్టాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థి విజయం కోసం పార్టీ కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ సైతం ప్రచారం చేసేందుకు తిరుపతి రానున్నారని వెల్లడించారు.
ఇరు పార్టీల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా ముందుకు సాగాలని.. ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని ఈ సమావేశంలో నేతలు నిర్ణయించారు. కాగా, రత్నప్రభ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందులో ఇరు పార్టీల నేతలు పాల్గొననున్నారు.