మళ్లీ సెంచరీ కొట్టిన టమోటా ధర

సోమవారం, 6 డిశెంబరు 2021 (09:52 IST)
టమోటా ధర మరోసారి భగ్గునమండింది. మొన్నటివరకు కేజీ టమోటాల ధర రూ.150 వరకు పలికింది. ఆ తర్వాత ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు పుణ్యమానికి ఈ ధర కిందికి దిగివచ్చింది. ఇపుడు మళ్లీ టమోటా ధర పెరిగింది. 
 
దక్షిణాది రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కూరగాయల దిగుబడి బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా, కుండపోత వర్షాలకు పంట సైతం నీటిలో మునిగిపోయింది. ఫలితంగా టమోటాల దిగుబడి పూర్తిగా లేకుండా పోయింది. దీనికితోడు వినియోగం, డిమాండ్ పెరగడంతో టమోటా ధర సెంచరీ కొట్టింది. ఆ తర్వాత ప్రభుత్వాల చొరవతో ఈ ధరలు దిగివచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో సోమవారం టమోటా ధర మళ్లీ పెరిగింది. కేజీ టమోటాలు రూ.130గా పలుకుతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లి హోల్‌సేల్ మార్కెట్‌లో ఈ ధర ఉంది. ఇక వినియోగదారుడు చెంతకు చేరే సమయానికి ఈ ధర మరింతగా పెరిగే అవకాశం ఉంది. 
 
కాగా, మదనపల్లి వ్యవసాయ మార్కెట్ నుంచి తూర్పు, ఉత్తరాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు కర్నాటక, పుదుచ్చేరి రాష్ట్రాలకు భారీగా ఎగుమతి చేస్తుంటారు. ఈ మార్కెట్‌లో నాణ్యమైన టమోటాలు రూ.6 నుంచి రూ.14 వరకు పలుకుంది. కానీ, వర్షాలకు దెబ్బకు ఇపుడు కేజీ టమోటాలు ఈ మార్కెట్‌లో రూ.50కు పైగా పలుకుతోంది. కానీ వినియోగదారుడు చెంతకు చేరే సమయానికి ఈ ధర సెంచరీ కొడుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు