ఆనందంలో ఎగిరి గంతేస్తున్న టిటిడి ఛైర్మన్... ఏమైంది..?

శుక్రవారం, 26 జులై 2019 (19:46 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. టిటిడి ఛైర్మన్‌గా బాధ్యతలు  స్వీకరించినప్పటి నుంచి అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు వై.వి.సుబ్బారెడ్డి. 
 
తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్లలోనే ప్రధానమైన విఐపి బ్రేక్ టిక్కెట్లను రద్దు చేసి అందరికీ ఒకేరకమైన దర్సనం పెట్టడం దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. టిటిడి ఛైర్మన్ ఎక్కడ పర్యటిస్తున్నా మీరు తీసుకుంటున్న నిర్ణయం బాగుందంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారట. 
 
గంటల తరబడి విఐపిలకే ఆలయంలో ఎక్కువ సమయం కేటాయిస్తూ సామాన్యులను ఇప్పటివరకు పట్టించుకోలేదు. విఐపి దర్సనంలో పెనుమార్పులు తీసుకురావడం ద్వారా సుమారు 2 గంటలకు పైగా సామాన్య భక్తులకు దర్సన అవకాశం లభిస్తోంది. ఇది నిజంగా మీరు తీసుకున్న గొప్ప నిర్ణయం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారట. ఇదే విషయాన్ని తిరుమలలో టిటిడి ఛైర్మన్ తెలిపారు.
 
తిరుమలలోని డంపింగ్ యార్డును పరిశీలించిన టిటిడి ఛైర్మన్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇంకా కొన్ని మార్పులు ఉన్నాయని, టిటిడి పాలకమండలి సభ్యుల నియామకం పూర్తయిన తర్వాత ఆ మార్పులు తీసుకువస్తామన్నారు టిటిడి ఛైర్మన్. వై.వి.సుబ్బారెడ్డి ఎలాంటి మార్పులు తీసుకువస్తారన్నదే ఇప్పుడు చర్చకు తెరలేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు