సెక్స్ రాకెట్ గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేస్తూ.. ఓ టీవీనటిని అరెస్ట్ చేశారు. యూసుఫ్‌గూడ మధురానగర్‌లోని ఓ వసతి గృహంలో వుంటూ టీవీ సీరియళ్లలో నటిస్తున్న ఓ నటితో పాటు మరో యువతి, ఓ మేకప్‌మేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సైనిక్‌పురి ఆర్కేపురానికి చెందిన మరో 28 ఏళ్ల మహిళతో పాటు యూసుఫ్‌గూడకు చెందిన మేకప్‌మెన్ బండారిలు ఓ ముఠాగా ఏర్పడి ఆన్‌లైన్ వ్యభిచారానికి పాల్పడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వీరివద్ద రూ. 1700 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.