ప్రాణం తీసిన టి.వి. సౌండ్ వ్యవహారం..

శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (15:48 IST)
TV
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో దారుణం జరిగింది. ఇంట్లో పెట్టిన  టి.వి. సౌండ్ వ్యవహారం ఒక వ్యక్తి ప్రాణం తీసింది.
ఆర్మూరులో రాజేందర్ అనే వ్యక్తి ఇంట్లో బాల నర్సయ్య అతని  భార్య అద్దెకు దిగారు. అయితే, వాళ్ళిద్దరి మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. దీంతో పక్కింట్లో ఉండేవాళ్ళకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంతే కాదు వీరు గొడవ పడెడప్పుడు టీవీలో వచ్చే మాటలు కూడా వినిపించేవి కాదట. 
 
వారి మాటలు భరించలేక ఓనర్ రాజేందర్ టీవీ సౌండ్ మరింతగా పెంచేశాడు. వారి గొడవకంటే టీవీ సౌండ్ అధికం కావడంతో, భార్యాభర్తలు ఓనర్ దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకున్నారు. గొడవ విషయంలో ఓనర్ కూడా తగ్గలేదు. 
 
దీంతో అద్దెకు ఉండే వ్యక్తి కోపంతో ఇనుపరాడ్‌తో రాజేందర్ తలపై కొట్టాడు. దీంతో అయన కిందపడిపోయాడు. హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్లగా, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అద్దెకు ఉండే వ్యక్తి అక్కడి నుంచి చల్లగా తప్పించుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు