ఫంక్షన్ జరుగుతుండగా ఉన్నట్టుండి కుర్చీలో నుంచి వేడిగా ఉన్న సాంబార్ గిన్నెలో పడిపోయింది చిన్నారి. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పాప ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.