మోడీ తప్పు చేశారు.. దేశంలో ఎకనమిక్ ఎమర్జెన్సీని సృష్టించారు: ఉండవల్లి

శనివారం, 12 నవంబరు 2016 (13:04 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోట్ల రద్దు వ్యవహారంపై ఓ వైపు ప్రశంసలు మరోవైపు విమర్శలు వస్తున్నాయి. మోడీ అనుభవరాహిత్యమే రూ.500, రూ1000 నోట్ల రద్దుకు ప్రధాన కారణమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. పెద్దనోట్లను రద్దు చేయడం ద్వారా నల్లధనం ఉన్నవారు ఇబ్బంది పడట్లేదని.. సామాన్య ప్రజానీకం నానా తంటాలు పడుతున్నారని విమర్శలు గుప్పించారు. 
 
నల్లధనం అరికట్టాలనే మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, కానీ పెద్ద నోట్ల రద్దు విషయంలో మోడీ తీరు సరిగ్గాలేదని ఉండవల్లి అన్నారు. ఈ విధానం పేద ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. పెద్దనోట్ల రద్దు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఉండవల్లి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గతంలో ఎవరూ చేయని తప్పును చేసి, దేశంలో ఎకనమిక్ ఎమర్జెన్సీని సృష్టించారని ఉండవల్లి పేర్కొన్నారు.  

వెబ్దునియా పై చదవండి