గ్రామసింహాల్లా ఎస్ఈసీపై పడ్డారు: వైసీపీ నేతలపై వర్ల రామయ్య ఫైర్

శనివారం, 30 జనవరి 2021 (11:16 IST)
రాష్ట్రప్రభుత్వం, ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై అప్రకటిత యుద్ధంచేస్తోందని, ఎస్ఈసీపై వ్యక్తిగత దూషణలకు కూడా వెనుకాడటంలేదని, ప్రభుత్వ పెద్దలు, సలహాదారులు, మంత్రులు ఆయన్ని అవమానపరిచేలా, చివరకు ఆయన డీఎన్ఏను కూడా తప్పుపట్టేలా మాట్లాడటం ద్వారా జగన్ ప్రభుత్వం చాలాపెద్ద తప్పుచేస్తోందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు, సుప్రీంకోర్టు,ఇతర వ్యవస్థలను లెక్కచేయకుండా పాలకులు ఎవరిని లెక్కచేస్తారన్న రామయ్య, సుప్రీంకోర్టు ఎన్నికలు జరపవలసిందేనని చెప్పినప్పుడు, ప్రభుత్వం ఎన్నికల కమిషన్ తో కోఆర్డినేషన్ చేసుకోమని చెప్పినా ఈవిధంగా వ్యవహ రించడం ఏమిటని రామయ్య మండిపడ్డారు.

కొందరు మంత్రులు ఎస్ఈసీపై గ్రామసింహాల్లా ఎగబడుతున్నారని, కొందరు మంత్రుల కు గ్రామ సింహాలంటే ఏమిటో కూడా తెలియదన్నారు. విచక్షణ మరిచి, ప్రజాప్రతినిధులమనే ఇంగితం లేకుండా, రాజ్యాంగవ్యవస్థ ను ప్రశ్నిస్తున్నామనే విషయం మర్చిపోయి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడటం ఏమిటన్నారు. ముఖ్యమంత్రే వారిని రెచ్చగొట్టి, ఎస్ఈసీపైకి ఉసిగొల్పాడని రామయ్య ఆరోపించారు.

అంబటిరాంబాబు, బొత్స సత్యనారాయణలకు ఏసంబంధముందని వారి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పంచాయతీరాజ్ శాఖామంత్రిగా ఎన్నికలనిర్వహణకు తాను ఏవిధంగా సహకరించ గలనని ఎస్ఈసీని అడగాల్సిన పెద్దిరెడ్డి రెచ్చిపోయి మాట్లాడటమేంటన్నారు. 40ఏళ్లు ఐఏఎస్ అధికారిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్, నేడు ఎస్ఈసీగా విధులు నిర్వర్తిస్తుంటే, ఆయన్ని తప్పు పట్టడం ఏమిటని రామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు.

నిమ్మగడ్డ రమే శ్ కుమార్ ఏమచ్చలేని వ్యక్తైతై, కోర్టుల్లో సాగుతున్న కేసులవిచార ణ పూర్తైతే, తమబ్రతుకేంటో తెలియనివారు, భవిష్యత్ ఏంటో తెలి యనివారంతా ఆయన్ని తప్పుపడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పోరాటం, ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉండి నేరచరిత్ర కలిగినవ్యక్తికి, 40ఏళ్లు ఐఏఎస్ అధికారిగా పనిచేసి నవ్యక్తికి మధ్య జరుగుతున్నదని వర్ల స్పష్టంచేశారు.

ఈ పోరాటం లో నీతివంతంగా పనిచేస్తున్న ఐఏఎస్అధికారి గెలవాలో, నేరాలు, అవినీతిచేసి, చట్టబద్ధంగా ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నవారు గెలవాలో ప్రజలే నిర్ణయించాలని టీడీపీనేత తేల్చిచెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షిపత్రికలో ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసేవాడని, నేడు ప్రజలసొమ్ముని జీతంగా తీసుకుంటూ, ప్రభుత్వ  సొమ్ముతో భోగాలు అనుభవిస్తూ, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఇష్టమొచ్చినట్లు దూషించడమేంటని రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక నేరస్తుల ముఠా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఫుట్ బాల్ ఆడుతుంటే, ప్రతిపక్షసభ్యులుగా తాముచూస్తూ ఊరుకోవాలా అని వర్ల ప్రశ్నించారు. వ్యక్తలకు అతీతంగా వ్యవస్థలను వెనుకేసుకొచ్చేం దుకు టీడీపీ వెనుకాడదని, భారతీయులుగా రాజ్యాంగాన్ని కాపాడ టం తమధర్మమని రామయ్య తేల్చిచెప్పారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ డీఎన్ఏ గురించి మాట్లాడినవారిని గ్రామసింహాలతో పోల్చడం తప్పేమీకాదన్నారు.

నిమ్మగడ్డ, చంద్రబాబుల డీఎన్ఏ  ఒక్కటే అనేమాట ఒక్కటేనని సిగ్గులేకుండా నిర్లజ్జగా వైసీపీవారు మాట్లాడినట్లు తాను మాట్లాడలేకపోతున్నానని, అందుకు సభ్యత  సంస్కారం తనకు అడ్డొస్తున్నాయని రామయ్య తెలిపారు. ఎక్కడై నా, ఎవరికైనా సహజంగా వారి తల్లిదండ్రుల డీఎన్ఏలు వస్తాయని, అలానే సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి కూడా వచ్చిఉంటాయని తాను భావిస్తున్నానన్నారు.

చంద్రబాబు డీఎన్ఏ నిమ్మగడ్డకు వస్తుందనడం, ఎంతటి బూతు మాటో, ఆ వ్యాఖ్యలు మంత్రులమని చెప్పుకునేవాళ్లు చేయడం నీచాతినీచమని రామయ్య ధ్వజమెత్తారు. మంత్రులుగా ఉండి, దొంగ బుద్ధులుచూపుతున్న వారు,  సిగ్గులేకుండా, ఇంగితం లేకుండా మాట్లాడటం ఇక్కడే చూస్తున్నామన్నారు. పుంగనూరు లో అన్ని స్థానాలు ఏకగ్రీవమవుతాయని మంత్రి పెద్దిరెడ్డి ఎలా  చెబుతున్నాడన్నారు.

ఆయనకున్న అధికారబలం, డబ్బు, పొగరుతో అవన్నీ సాధ్యమవుతాయన్నారు. అవినీతిమంత్రుల, అవినీతిప్రభు త్వం ఏకగ్రీవాల ముసుగులో ఏమైనా చేయడానికిసిద్ధంగా ఉన్నార నే, తాము ఎస్ఈసీకి ఏకగ్రీవాలపై ఒకకన్నేసి ఉంచాలని కోరడం జరిగిందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వసలహాదారు పదవి నుంచి తొలగించి, అతనిపై వెంటనే చట్టరీత్యా క్రిమినల్ చర్య లు తీసుకోవాలని రామయ్య ఎస్ఈసీకి విజ్ఞప్తిచేశారు.

డీఎన్ఏ గురించి మాట్లాడి,  ఇద్దరువ్యక్తుల కుటుంబాలగురించి, డీఎన్ఏలంటూ నీచంగామాట్లాడిన మంత్రులపై కూడా కఠినచర్యలు తీసుకోవాలని, అలాజరగకుంటే రేపట్నుంచీ అందరూ వారిబాటలోనే నోటికి పనిచెప్పే అవకాశాలు మెండుగా ఉంటాయని రామయ్య చెప్పారు.  సత్తైనపల్లిలో ఏంజరుగుతుందో చూసుకోకుం డా అంబటికూడా మాట్లాడితే ఎలాగన్నారు.

పంచాయతీ ఎన్నికలు ఎలా నిర్వహించాలనే ఆలోచనచేయకుండా, ఎస్ఈసీనేలక్ష్యంగా వైసీపీనేతలు, మంత్రులు గ్రామసింహాల్లా ప్రవర్తించడం మానుకోవా లన్నారు.  గవర్నర్ కూడా రబ్బర్ స్టాంప్ లా ప్రవర్తించకుండా, న్యా యబద్ధంగా, రాజ్యాంగవ్యవస్థలకు రక్షణగా నిలవాలని రామయ్య హితవుపలికారు. టీడీపీనేతలు గవర్నర్ ను కలవడానికి వెళ్తే, ఆయన్ని కలిసేఅవకాశం ప్రతిపక్షపార్టీసభ్యులకు ఇవ్వలేదన్నారు. 

రాష్ట్రంలో టీడీపీనే ప్రధానప్రతిపక్షమని, అదిగుర్తుంచుకోకుండా చిన్నచిన్న పార్టీలవారిని గుర్తించడం సరికాదన్నారు. వైసీపీవారు గ్రామసింహాల్లా మాట్లాడుతున్నారని, వారిని కట్టడిచేయకపోతే, నేడు రమేశ్ కుమార్ ని అనరాని మాటలన్నవారే, రేపు గవర్నర్ నుకూడా అంటారని రామయ్య స్పష్టంచేశారు. 
 
ఎస్ఈసీని ఎవరు గట్టిగా తిడతారో, వారికి మంచిఅవకాశాలుం టాయని జగన్ చెప్పబట్టే, అంబటిరాంబాబు వంటివారు కూడా నోరు తెరుస్తున్నారన్నారు.  ఎస్ఈసీపై వ్యక్తిగత దూషణలు చేసిన ఇద్దరు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ముఖ్యమంత్రి వెంటనే చర్యలుతీసుకోవాలని, గవర్నర్ కూడా  ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని రామయ్య డిమాండ్ చేశారు. 

తన అన్నకు పెద్ద పంగనామం పెట్టిన సజ్జల ఒకప్పుడు నెలజీతానికి, గాలికూడా లేని గదిలోకూర్చొని సాక్షిపత్రికలో పనిచేసేవాడన్నారు. కలక్షన్, ఎలక్షన్ అనేవ్యవహరాలపైనే సజ్జల దృష్టంతాఉందని, అతనిపై ఎస్ఈసీ పూర్తిస్థాయిలో నిఘాపెడితే, ఎన్నికల్లో అధికార పార్టీ చేయబోయే గుట్టుమట్లన్నింటినీ పసిగట్టవచ్చన్నారు. 

డీజీపీ సవాంగ్, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లు సజ్జల ప్రతికదలిక పై నిఘా ఉంచాలని, అలాచేయకపోతే, ఎన్నికల ప్రక్రియనే అతను అపహస్యం చేస్తాడన్నారు. ఈఎన్నికలకు అధికారపార్టీ ఖర్చుపెట్టే ప్రతిరూపాయి సజ్జల కనుసన్నల్లోనే బయటకు వస్తుందనే వాస్త వాన్ని ప్రజలంతా కూడా తెలుసుకోవాలన్నారు.

గతంలో అద్దెఇళ్లలో ఉండి, కాలినడకన తిరిగినవారు, నేడు బహుళ అంతస్తుల భవనా ల్లో ఉంటూ, ఇంఫాల కార్లలో తిరుగుతుంటే, అటువంటి వారి గురిం చి ప్రజలు ఆలోచన చేయకపోతే ఎలాగన్నారు. విజయసాయిరెడ్డి మాటలు వింటుంటే వెగటు పుడుతోందని, అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిదని రామయ్య అభిప్రాయప డ్డారు. 

ముఖ్యమంత్రి జగన్ ఎస్ఈసీ పై ఎందుకు అప్రకటిత యుద్ధం ప్రకటించారో, తొలినుంచీ రాజ్యాంగాన్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో చెప్పాలని రామయ్య డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై జగన్ కు ఏదైనా చులకనభావముంటే, తక్షణమే దాన్ని తొలగించుకొని, సుప్రీంకోర్టు ఆదేశాలను విధిగా పాటించాలని స్పష్టంచేశారు.

ప్రభుత్వాన్ని ఇగోతగ్గించుకోమని సుప్రీంకోర్టు చెప్పి నాకూడా ఇంకా ఎందుకు నిమ్మగడ్డను సాధించాలని, అవమానప రచాలని ఎందుకుచూస్తున్నారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రికి, ఆయన మంత్రులకు ఇది ఎంతమాత్రం మంచిపద్ధతి కాదన్నారు. 

ఎస్ఈసీ ఇద్దరు అధికారులపైచర్యలు తీసుకుంటే, వారినికాపాడతా మని ప్రభుత్వం చెబితే, ఏ అధికారైనా ఎస్ఈసీ ఆదేశాలకు అనుగు ణంగా పనిచేస్తాడా అని రామయ్య ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ను లెక్కచేయకుండా, కమిషనర్ ని ఖాతరుచేయకుండా పనిచేయ మని ప్రభుత్వమే అధికారులకు చెప్పడం రాజ్యాంగాన్ని ధిక్కరించడం, సుప్రీంఆధేశాలను ధిక్కరించడం కాదా అని రామయ్య నిలదీశారు.

అధికారులను జైలుకు తీసుకెళ్లే అలవాటు జగన్ కు ఉందని, కాబట్టి అధికారులంతా జగన్ మాటలు వినకుండా ఎన్నికలప్రక్రియ ను సజావుగా నిర్వహించాలని రామయ్య విజ్ఞప్తిచేశారు. శ్రీలక్ష్మి, రత్నప్రభ, ఆచార్య, రాజగోపాల్ వంటిఎందరినో ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. అధికారులంతా నిమ్మగడ్డకు సహకరించి, రాజ్యాంగాన్ని గౌరవిస్తేవారికే మంచిదని రామయ్యహితవుపలికారు 

ఎస్ఈసీపై నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేసిన, ఇద్దరు మంత్రులపై చర్యలు తీసుకోవాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్న సజ్జలను తక్షణమే ఆ పదవినుంచి తొలగించి, అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రామయ్య డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు