కడపను కొడతామనీ, పులివెందులను గెలుస్తామనీ తెదేపా నేతలు పదేపదే చెప్పారనీ, ఆ పార్టీ నేతల వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని ఆమె ప్రశ్నించారు. కడప తెదేపా ఎంపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగులో ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారో అందరికీ తెలుసునని చెప్పారు.
వివేకానంద రెడ్డి మరణంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరిన వాసిరెడ్డి పద్మ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తో నిజనిజాలు వెలుగు చూస్తాయనే నమ్మకం తమకు లేదనీ, అసలైన నిజాలు వెలుగు చూడాలంటే సీబీఐ చేత విచారణ జరిపించి తీరాలని డిమాండ్ చేసారు.