టిటిడి ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా వేమూరి ఉషా రాణి

సోమవారం, 11 నవంబరు 2019 (05:56 IST)
రాష్ట్ర దేవాదాయ శాఖ కార్య‌ద‌ర్శి వేమూరి ఉషా రాణి  తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు.

టిటిడి అదనపు ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి వేమూరి ఉషా రాణితో ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.

ఆ తరువాత అదనపు ఈవో స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని వారికి అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, బోర్డు సెల్‌  ఏఈవో సుశీల‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు