ఇంతకీ విషయం ఏంటయా అంటే, నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రిలో నూతన భవనాల ప్రారంభానికి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఇండోర్ స్టేడియంల శంకుస్థాపన కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వెనుక చాలామంది కార్యకర్తలు, నాయకులు గుమిగూడారు. దీనితో ఆయన ఓ మాట అన్నారు.
అదేమిటంటే.. ‘ దయచేసి నా వెనుక ఎవరూ ఉండొద్దండీ. ఎందుకంటే 1984లో వెనుక ఉన్నవారు దివంగత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారు. అప్పటినుంచి నాకు అనుమానమే. అందుకే ముందు ఉండాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వెన్నుపోటు వ్యాఖ్యలు ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం అప్పుడప్పుడు మామ ఎన్టీఆర్ ను చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారంటూ వ్యాఖ్యానిస్తుంటారు. అలాగే లక్ష్మీపార్వతి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంటారు. మరి ఈ నేపధ్యంలో వెంకయ్య చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడుని ఏమయినా తాకుతాయా...? ఏమో?