విజయసాయికి షాక్ : రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్ నుంచి ఔట్

గురువారం, 8 డిశెంబరు 2022 (08:53 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్ పేర్ల జాబితా నుంచి ఆయన పేరును తొలగించింది. బుధవారం ప్రకటించిన జాబితాలో విజయసాయి రెడ్డి పేరు మొదటగానే ఉంది. దీనిపై అనేకమంది పలు రకాలైన విమర్శలు చేశారు. అనేక ఆర్థిక నేరాల కేసుల్లో విజయసాయి రెడ్డి ఏ2గా ఉన్నారు. ఈ నేథ్యంలో ఆ ప్యానెల్ జాబితా నుంచి విజయసాయిరెడ్డి పేరు మాయం కావడం గమనార్హం. 
 
బుధవారం మొత్తం ఎనిమిది మందితో రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్‌ను ప్రకటించారు. అయితే, నేడు రాజ్యసభ ప్యాలెన్ సభ్యుల జాబితాను వెల్లడించే క్రమంలో రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ ఏడు పేరు మాత్రమే చదివారు. అందులో విజయసాయి రెడ్డి పేరులేదు. ఆయనను వైస్ ఛైర్మన్ ప్యానెల్ నుంచి తొలగించినట్టు రాజ్యసభ ఛైర్మన్ వెల్లడించారు. 
 
అయితే, ప్యానెల్ జాబితా నుంచి విజయసాయి రెడ్డి పేరును తొలగించడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాగా, రాజ్యసభ ఛైర్మన్ ప్యానెల్‌లో డాక్టర్ ఎల్.హనుమంతయ్య, భుభనేశ్వర్ కలిటా, సురేంద్ర సింగ్ నాగర్, తిరుచ్చి శివ, సుఖేందు శేఖర్ రెడ్, డాక్టర సస్మిత్ పాత్రా, సరోజ్ పాండే సభ్యులుగా ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు