ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న విద్యా దీవెన ఒకటి. ఈ పథకం కింద విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇందులోభాగంగా, మంగళవారం ఈ డబ్బులు జమ చేయాల్సివుంది. అయితే, ఈ రోజు ఈ నిధులను జమ చేయడం లేదు.