విజయసాయిరెడ్డి. ఎపి సిఎం చంద్రబాబునాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతల నోళ్ళలో ఎక్కువగా నానుతున్న పేరు. వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కంటే విజయసాయిరెడ్డే ఇప్పుడు చంద్రబాబుకు, టిడిపికి టార్గెట్‌గా మారారు. విజయసాయి ప్రతి కదలికపైనా నిఘా పెట్టడడమే కాకుండా అతని ప్రతి చర్యను గమనిస్తున్నారు టిడిపి నేతలు. అసెంబ్లీలోను, టెలికాన్ఫరెన్స్ లోను, పబ్లిక్ మీటింగ్ లోను ఇలా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.
ఆర్థిక నేరగాడు.. పలు కేసుల్లో ఎ-2గా ఉన్న విజయసాయిరెడ్డికి ప్రధాని ఆఫీసులో ఏం పని అంటూ విరుచుకుపడుతున్నారు. విజయసాయిని విజయమాల్యతో పోల్చుతూ వైసిపిని జగన్‌ను, అటు బిజెపిని మోడీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు టిడిపి నేతలు. తనను టార్గెట్ చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న విజయసాయిరెడ్డి టిడిపిలోని అందరిపైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. కానీ టిడిపి నేతలు మాత్రం విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసి ఆయన ప్రతి కదలికను టిడిపి అధినేతకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఎపి రాజకీయాల్లో చంద్రబాబు వర్సెస్ విజయసాయిరెడ్డి వ్యవహారమే హాట్ టాపిక్‌గా మారుతోంది.