విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకుల మృతి

శనివారం, 1 జనవరి 2022 (15:35 IST)
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తొలిరోజే విశాఖలో ముగ్గురు యువకుల ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. విశాఖ బిఆర్టిఎస్ రోడ్డులో ఈ రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది. 
 
వేపగుంట ప్రాంతానికి చెందిన నితీష్, మోహన్ వంశీ.. ఓ బైక్ పై హనుమంతవాక వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదర్శనగర్ కు చెందిన రాకేష్, రాంబాబు మరో బైక్‌పై హనుమంతవాక నుంచి అడవివరం వైపు వెళుతున్నారు.
 
ఈ క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలు బిఆర్టిఎస్ రోడ్ లోని అపోలో హాస్పిటల్ ప్రాంతానికి వచ్చేసరికి.. ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే నితీష్, రాకేష్, రాంబాబు ప్రాణాలు కోల్పోయారు. 
 
మోహనవంశీ తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు