కొత్త సంవత్సరం వేడుకలు.. కోవిడ్ జాగ్రత్తలు.. రోడ్లపై అలా చేస్తే?
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (13:55 IST)
2023 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం కోవిడ్ -19, అలాగే ఒమిక్రాన్ ప్రమాదం దేశవ్యాప్తంగా పొంచి ఉంది. చాలా రాష్ట్రాలు ప్రజల కోసం ఆంక్షలు, కర్ఫ్యూ సమయాలను విధించడం ప్రారంభించాయి. 2021 డిసెంబర్ 31 న విశాఖపట్నంలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి విశాఖపట్నం నగర పోలీసులు వరుసగా రెండవ సంవత్సరం కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
నగరవాసులు సామాజిక బాధ్యతగా బహిరంగ ప్రదేశాలు, పార్కులు, రహదారులలో ఎటువంటి వేడుకలు నిర్వహించేందుకు వీలు లేదు. విశాఖ నగరవాసులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని అదనపు డీసీపీ (ట్రాఫిక్) సీహెచ్ ఆదినారాయణ విజ్ఞప్తి చేశారు. సమాజ సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలని కోరారు.
కొత్త సంవత్సరం సందర్భంగా విశాఖపట్నం ఆంక్షలపై అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) సిహెచ్ ఆదినారాయణ మాట్లాడుతూ..
1. ఆర్కే బీచ్, జోద్గుళ్లపాలెం బీచ్, సాగర్ నగర్ బీచ్, రుషికొండ బీచ్, భీమిలి బీచ్, యారాడ బీచ్లకు రాత్రి 8 గంటల నుంచి సందర్శకులు, వాహనాల రాకపోకలను పరిమితం చేస్తారు.
2. నావల్ కోస్టల్ బ్యాటరీ (ఎన్సిబి) నుండి భీమిలి వరకు బీచ్ రోడ్ లో అన్ని వాహనాల రాకపోకలను రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు పరిమితం చేస్తారు.
3. తెలుగుతల్లి, ఎన్ఏడీ ఫ్లైఓవర్లను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేస్తారు.
4. హనుమంతవాక నుంచి అడవివరం జంక్షన్ వరకు బీఆర్టీఎస్ రోడ్డును మూసివేస్తారు. గోశాల జంక్షన్ నుండి వేపగుంట జంక్షన్ వరకు; పెందుర్తి జంక్షన్ నుంచి ఎన్ ఏడీ జంక్షన్ నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు బంద్ చేస్తారు. అలాగే అత్యవసర వాహనాలు రెండు వైపులా సర్వీస్ రోడ్డును ఉపయోగించాలి.
5. మద్దిలపాలెం జంక్షన్ నుంచి రామా టాకీస్ వరకు బీఆర్టీఎస్ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ అండర్ పాస్ ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేస్తారు.
6. రోడ్లపై అతివేగం, భారీ శబ్దాలు చేయడం లేదా మద్యం సేవించి పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లు, షాపులు వారికి కేటాయించిన సమయానికే పరిమితం కావాలని సిహెచ్ ఆదినారాయణ పేర్కొన్నారు.