కొత్త సంవత్సరం వేడుకలు.. తప్ప తాగి బండి తీస్తే తాట తీస్తారు.. ఆంక్షలివే..

శుక్రవారం, 30 డిశెంబరు 2022 (13:45 IST)
కొత్త సంవత్సరం వేడుకలలో భాగంగా ఏపీలో ఆంక్షలు అమలులో వున్నాయి. విశాఖలో మద్యం తాగి వాహనాలను నడిపేవారి కోసం రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఐదు వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు. నగరంలో కీలకమైన కూడళ్లు, రోడ్లపై బ్రీత్ ఎనలైజర్లలో తనిఖీలు చేస్తారు. ఎవరైనా మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనం సీజ్ చేసి కోర్టులో హాజరుపరుస్తారు. రోడ్డుపై ఎక్కడికక్కడ పార్కింగ్ చేస్తే టోయింగ్ వాహనాలతో స్టేషన్ కు తరలిస్తారు. 
 
న్యూ ఇయర్ శుభాకాంక్షలు పేరుతో మహిళల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించేవారిని వెంటనే అదుపులోకి తీసుకునేందుకు మఫ్టీలో పోలీస్ సిబ్బందిని నియమిస్తున్నారు. వేమన మందిరం నుంచి డీఎల్‌ఓ జంక్షన్‌ వరకూ తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని 31వ తేదీ రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఐదు గంటలు వరకూ మూసివేస్తారు. పాదచారులను కూడా అనుమతించరు.
 
కొత్త సంవత్సర వేడుకల్లో బాణ సంతా కాల్చితే కేసులు ఖాయం. జిగ్‌జాగ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసేవారిని పోలీసు సిబ్బంది బాడీవార్న్‌ కెమెరాలతో రికార్డు చేస్తారు. ట్రిపుల్‌ రైడింగ్‌, హారన్‌ మోగించడం, సైలెన్సర్‌ తీసి సౌండ్‌ చేయడం చేస్తే కేసులు ఖాయం. 
 
ఇంకా విశాఖ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో మధ్య లైన్‌ను రాత్రి 9 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 5 గంటల వరకూ బంద్ చేస్తారు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని అండర్‌పాస్‌ ద్వారా ఆర్టీసీ మినహా ఇతర వాహనాల రాకపోకలకు అనుమతి లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు