విశాఖ హైవేపై లేడీ లవర్ మహిళా ఇన్‌స్పెక్టర్ అవతారంలో హల్‌చల్

శుక్రవారం, 8 జులై 2016 (17:00 IST)
విశాఖ‌: అది విశాఖ హైవే. విశాఖ జిల్లా చీడికాడ మండలం వడ్డాది గ్రామంలో బ్రేక్ ఇన‌స్పెక్ట‌ర్ కారులో కూర్చున్నారు. ఒక మ‌హిళ యూనిఫామ్‌లో కారులు, లారీలు ఆప‌డం మొద‌లు పెట్టింది. కారులో ఇన‌స్పెక్ట‌ర్ గారున్నారు. మీ వ‌ద్ద లైసెన్స్ సీ బుక్ ఉన్నాయా?  లోడ్ ఏంటి... అంటూ ఆ మ‌హిళ దబాయించింది. ఏది లేక‌పోయినా ప‌దండి ఇన‌స్పెక్ట‌ర్ ద‌గ్గ‌రికి అంటూ హూంక‌రించింది. దీనితో వాహ‌నదారులు నోరుమూసుకుని మామూళ్ళు స‌మ‌ర్పించుకుని బ‌తుకుజీవుడా అంటూ వాహ‌నాల‌తో తుర్రుమ‌న్నారు. 
 
కానీ, త‌ర్వాత బ‌య‌ట‌ప‌డింది. ఆ ఇన్‌స్పెక్ట‌ర్ అస‌లీ కాద‌ని, ఆమె అత‌డి ల‌వ‌ర్ అని. ఇలా విశాఖ హైవేపై ఓ జంట వాహ‌నదారుల‌ను బురిడీ కొట్టించింది. ఏకంగా బోలెడు వాహ‌నాల‌ను ఆపి న‌కిలీ బ్రేక్ ఇన్‌స్పెక్ట‌ర్ హల్‌చల్ చేశాడు. ఓ మహిళతో కలిసి వాహనదారుల నుంచి రూ. లక్షకు పైగా వసూలు చేశారు. చివ‌రికి ఈ విష‌యం తెలిసి, స్థానికులు నకిలీ బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ను చీడికాడ పోలీసులకు అప్పగించారు.

వెబ్దునియా పై చదవండి