రుషికొండ నిషిద్ధ ప్రాంతమా..? లేక పాకిస్థాన్‌లో ఉందా? జనసేన ప్రశ్న

శుక్రవారం, 11 ఆగస్టు 2023 (17:05 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను విశాఖపట్టణం వేదికగా సాగిస్తున్నారు. తొలి రోజున విశాఖ జగదాంబ సెంటరులో ఆయన రోడ్‌షోలో పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండో రోజైన శుక్రవారం రిషికొండ ప్రాంతానికి వెళ్లాలని ఆయన తలపించారు. అయితే, వైజాగ్ పోలీసులు అందుకు సమ్మతించలేదు. రిషికొండ వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. ఇదే విషయాన్ని జనసేన పార్టీ ఓ వీడియోను తీసి పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించింది. 
 
"రుషికొండ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలు పరిశీలించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు అన్న సమాచారం అందుకున్న పోలీసులు రుషికొండకి వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధనం చేశారు. సామాన్య ప్రజలను సైతం కనీసం వెళ్ళనివ్వలేదు. రుషికొండ పర్యాటక ప్రాంతమైనప్పటికీ నిషిద్ధ ప్రాంతంగా మార్చేశారు. రుషికొండకు వెళ్లే అన్ని మార్గాలను బారికేడ్లతో మూసివేసి పక్క దేశం వెళ్లినట్లుగా మార్చారు. రుషికొండ ప్రాంతం పూర్తి నిషిద్ధ ప్రాంతంలో ఉందా..? లేక పాకిస్థాన్ దేశంలో ఉందా అన్నట్లుగా పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటూ ట్వీట్ చేసింది. 

 

రుషికొండ నిషిద్ధ ప్రాంతమా..?

రుషికొండ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలు పరిశీలించేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు అన్న సమాచారం అందుకున్న పోలీసులు ఋషికొండ కి వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధనం చేశారు. సామాన్య ప్రజలను సైతం కనీసం వెళ్ళనివ్వలేదు. ఋషికొండ… pic.twitter.com/6aKMlackVX

— JanaSena Party (@JanaSenaParty) August 11, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు