ఆదివారం నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతమైందని, అణు జలాంతర్గామి నుంచి 3500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదని డీఆర్డీవో తెలిపింది. ఈ బాలిస్టిక్ క్షిపణిని ఐఎన్‌ఎస్ అరిహంత్‌లో అమర్చేలా అభివృద్ధి చేశామని, 17 టన్నుల బరువుండే ఈ క్షిపణి రెండు టన్నుల వార్‌హెడ్‌ను మోసుకుపోగలదని డీఆర్డీవో తెలిపింది.