ఒక రాష్ట్రం.. మూడు రాజధానులు, ఒక హైకోర్టు, రెండు ప్రాంతాల్లో సీఎం క్యాంపు కార్యాలయాలు, రెండు చోట్ల అసెంబ్లీ సమావేశాలు.. ఇవీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక సిఫారసులు చేసింది.
బీసీజీ కూడా జగన్‌కు నివేదిక ఇచ్చింది. దేశంలోని బహుళ రాజధానులు, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణపై నివేదికలో ప్రస్తావించారు. అయితే ఈ రెండు కమిటీలపై చర్చించేందుకు ఈనెల 20న అసెంబ్లీ, 21న శాసన మండలిని సమావేశపర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.
బిల్లును మరింత నిశిత పరిశీలనకు సెలెక్ట్ కమిటీకి పంపవచ్చు. ఆ పేరుతో ఏ నిర్ణయం తీసుకోకుండా నెల, రెండు నెలలు గడిపేయవచ్చు. లేదా ఆ బిల్లుకు సవరణలు ప్రతిపాదించి వెనక్కు అసెంబ్లీకి పంపవచ్చు. అసెంబ్లీ మరోసారి దాన్ని ఆమోదించి మండలికి పంపాల్సి ఉంటుంది.