పిల్ల సైకోకు కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తా : నారా లోకేశ్

బుధవారం, 23 ఆగస్టు 2023 (08:55 IST)
టీడీపీ టిక్కెట్‌పై గెలిచి వైకాపా పంచన చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తగినశాస్తి తప్పదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. మంగళవారం రాత్రి గన్నవరంలో జరిగిన యువగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, వల్లభనేని వంశీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, గన్నవరం టీడీపీ కంచుకోట. గన్నవరాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీనే. పుచ్చల పల్లి సుందరయ్యగారి వంటి గొప్ప వ్యక్తులు, దాసరి బాలవర్థన్ వంటి మంచి నేతలు గన్నవరం ఎమ్మెల్యేలుగా పనిచేశారని గుర్తు చేశారు.
 
ఇంత గొప్ప చరిత్ర ఉన్న గన్నవరంలో మేము చేసిన తప్పు వల్ల ఒక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యాడు. ఈ పిల్ల సైకో మహా నటుడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు సార్ సార్ అంటూ ఛాంబర్‌కి వచ్చేవాడు. గౌరవంగా కూర్చోమన్నా నిలబడే ఉండేవాడు. ఈ పిల్ల సైకో పార్టీని వదిలిపెట్టి పోయాడు. 2012 సన్న బియ్యం సన్నాసి పోవడంతో సగం దరిద్రం పోయింది. ఇంకో సగం 2019లో పిల్ల సైకో పోవడంతో పార్టీకి పట్టిన దరిద్రం పూర్తిగా పోయింది.
 
ఈ పిల్ల సైకో పెద్ద తప్పు చేశాడు. దేవాలయంలాంటి గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి చేసి తగలబెట్టాడు. గెలిపించిన క్యాడర్‌పైనే కేసులు పెట్టించాడు. పార్టీ మారి పిల్ల సైకో పీకింది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. పెద్ద సైకోని ఆదర్శంగా తీసుకుని దోచుకుంటున్నాడు. పిల్ల సైకో... నువ్వు భయంతో బ్రతికే రోజులు దగ్గర్లో ఉన్నాయి. మనం సినిమాల్లోనే కరెంట్ షాక్ ట్మీట్మెంట్ చూశాం.. ఈ పిల్ల సైకోకు చెబుతున్నా.. అరే.. పిల్ల సైకో.. నీకు కరెంట్ షాక్ ట్రీట్మెంట్ నేను ఇస్తా. గన్నవరంలో గెలిచేది టీడీపీనే... నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేది టీడీపీనే అంటూ లోకేశ్ పునరుద్ఘాటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు