Sivakarthikeyan : మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా శివకార్తికేయన్ మదరాసి

దేవీ

మంగళవారం, 26 ఆగస్టు 2025 (11:43 IST)
Sivakarthikeyan, Rukmini Vasanth
అరుదైన మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా శివకార్తికేయన్, ఆయన పాత్ర చుట్టూ డ్రెగ్ మాఫియా నేపథ్యంలో మదరాసి సినిమా రూపొందుతోంది.  అమరన్ తర్వాత శివకార్తికేయన్ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మదరాసి'తో రాబోతున్నారు. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టైటిల్ టీజర్ రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు
 
'నీలాగే ఇతరులను ప్రేమించు. అందరూ నీ కుటుంబమే అనుకో. అదే అన్ని రిలీజియన్స్ అందరూ దేవుళ్ళు చెప్పేది' అనే హీరోయిన్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి కథ వేగంగా మలుపు తిరుగుతుంది. సిటీ వైపు ఆరు  ట్రక్కుల్లో అక్రమంగా తయారు చేసిన గన్స్ బయలుదేరుతాయి. వీటిని అడ్డుకోవడానికి పోలీసులు రంగంలో దిగుతారు. అన్నింటికీ సెంట్రల్ పాయింట్ గా వుండే శివకార్తికేయన్ పాత్ర అరుదైన మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా పరిచయం కావడం, తన స్థితి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయడం క్యురియాసిటీని మరింత పెంచుతుంది. తన గర్ల్‌ఫ్రెండ్‌ని రక్షించడానికి జీవితాన్నే మార్చేసే నిర్ణయం తీసుకుంటాడు.
 
ఏఆర్ మురుగదాస్ మాస్, ఎమోషన్ కలిపిన ఒక యూనిక్ కథని ప్రజెంట్ చేశారు. సుదీప్ ఎలమోన్ కెమెరా వర్క్ గ్రాండ్ విజువల్స్ అందించింది. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్ పెంచేస్తుంది. శ్రీలక్ష్మీ మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్  రిచ్‌గా, థియేట్రికల్ ఫీల్ ఇస్తున్నాయి.
 
శివకార్తికేయన్ ఫెరోషియస్‌, ఇంటెన్స్‌గా కనిపించారు. లేయర్స్ ఉన్న క్యారెక్టర్‌ని అద్భుతంగా చేశాడు. హీరోయిన్ రుక్మిణి వసంత్ కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, పెర్ఫార్మెన్స్‌కి మంచి స్కోప్ ఉన్న పాత్రలో కనిపించింది. విలన్‌గా విద్యుత్ జమ్వాల్ తన మెనేసింగ్ ప్రెజెన్స్‌తో కాంఫ్లిక్ట్‌ని మరింత ఎడ్జీగా మార్చాడు.  ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.
 
తారాగణం : శివకార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్, బిజు మీనన్, షబీర్ కల్లరక్కల్, విక్రాంత్

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు