అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి వ్యతిరేకత తెలిపే వారి తల నరుకుతానని హెచ్చరించిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టి రాజాసింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో శ్రీరామ నవమి సందర్భంగా తీసిన ఊరేగింపులో ముస్లిం మతస్తులకు వ్యతిరేకంగా రాజాసింగ్ రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని మజ్లీస్ బచావో తెహ్రీజ్ (ఎంబీటీ) ప్రతినిధి అహ్మద్ ఖానా ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే పలుమార్లు ముస్లింలకు వ్యతిరేకంగా హెచ్చరికలు చేశారన్నారు.
నేను సవాలు చేస్తున్నా. రామాలయ నిర్మాణాన్ని అడ్డుకునే పులికి ఏ తల్లయినా జన్మనిచ్చిందా అని సవాలు చేస్తున్నా. అలాంటివారికి మరో బాబ్రీమసీదు ఘటనను ఎక్కడో ఒకచోట మళ్లీ ఏర్పాటు చేస్తా అని బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరించారు. రామాలయ నిర్మాణం నుంచి మమ్మల్నెవరూ ఆపలేరు. ఆలయ నిర్మాణం జరిగే రోజు ఎంతో దూరం లేదు. అయోధ్య రామాలయ నిర్మాణం ప్రతి హిందువు స్వప్నం అని బిజేపీ ఎమ్మెల్యే ప్రకటించారు.