కాంగ్రెస్‌లో రేణుకా చౌదరి కాక.. టిక్కెట్ ఇవ్వకపోతే గుడ్‌బై

గురువారం, 14 ఫిబ్రవరి 2019 (13:49 IST)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేణుకా చౌదరి కాక మొదలైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం టిక్కెట్ తనకు కేటాయించకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తానంటూ ఆమె ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు తెలంగాణా రాష్ట్రంలోనే కాకుండా హస్తినలో కూడా వేడిపుట్టిస్తున్నాయి. 
 
కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత నమ్మకస్తుల్లో రేణుకా చౌదరి ఒకరు. ఈమెకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఖమ్మం లోక్‌సభ టిక్కెట్‌ను ఇతరులకు కేటాయించవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. 
 
దీనిపై రేణుకా చౌదరి స్పందించారు. ఖమ్మం పార్లమెంట్ సీటు టికెట్ తనకే కేటాయించాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడుతానంటూ హెచ్చరించారు. కార్యకర్తల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో కాకపుట్టింది. 
 
ఖమ్మం పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీచేసేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేథప్యంలో తన నివాసంలో పార్టీ కార్యకర్తలు, తన అనుచరులతో సమావేశమైన రేణుకా చౌదరి.. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సీటు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించి ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై కాంగ్రెస్ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు