కాంగ్రెస్ పార్టీకి కిషోర్ చంద్రదేవ్ రాజీనామా... టీడీపీవైపు చూపు

ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (13:14 IST)
కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనను గట్టిగా సమర్థించిన వారిలో ఈయన ఒకరు. విభజనకు ముందు ఈయన అరకు ఎంపీగా ఉన్నారు. గత యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిపదవి వరించింది. దీంతో ఆయన రాష్ట్ర విభజనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయింది. ఫలితంగా అనేక మంది కాంగ్రెస్ నేతలు వివిధ పార్టీల్లో చేరుతున్నారు. ఆ జాబితాలో ఇపుడు కిషోర్ చంద్రదేవ్‌ కూడా చేరిపోయారు. ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడం ఇక కష్టం అని భావిస్తున్నందువల్లే.. టీడీపీలో తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నట్టు చెబుతున్నారు. 
 
కాగా, కాంగ్రెస్ తరుపున ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా, ఒకసారి రాజ్యసభ ఎంపీగా చంద్రదేవ్ పనిచేశారు. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో గిరిజనశాఖ మంత్రిగానూ పనిచేశారు. తొలినుంచి ఢిల్లీ రాజకీయాల‌పైనే చంద్రదేవ్ ఎక్కువ ఆసక్తి చూపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున అరకు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో.. రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులోభాగంగానే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు