మహిళా డాక్టర్ సూసైడ్... 3 రోజులుగా ఇంటి ముందే శవాన్ని పెట్టుకున్నారు... ఎందుకు?

శనివారం, 10 జూన్ 2017 (14:41 IST)
విజయవాడలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపుల వల్ల ఈ వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అందువల్ల డాక్టర్ భర్తపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ వారు పట్టుబడుతున్నారు. 
 
విజయవాడ, పటమట అశోక్ నగర్‌లో సునీల్, సుష్మ అనే దంపతులు నివశిస్తున్నారు. వీరిలో సుష్మ డాక్టరుగా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో సుష్మా ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భర్త వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. 
 
ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగింది. అప్పటి నుంచి అంత్యక్రియలు కూడా నిర్వహించకుండా మృతదేహాన్ని అలానే భద్రపరిచారు. ఆత్మహత్యకు కారణమైన సుష్మ భర్త సునీల్‌పై చర్య తీసుకునేంత వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని బంధువులు భీష్మించి కూర్చొన్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించే దిశగా చర్చలు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి