అమెరికాలో కృష్ణా జిల్లా యువతి మృతి.. ఎలాగంటే...

సోమవారం, 14 సెప్టెంబరు 2020 (07:52 IST)
కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువతి అమెరికాలో ప్రాణాలు కోల్పోపోయింది. కొలంబియాలో ఉంటున్న ఆమె... తమ బంధువులను చూసేందుకు వెళుతూ మార్గమధ్యంలో ఓ జలపాతం వద్ద సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు గ్రామానికి చెందిన పోలవరకు కమల (26) అనే యువతి అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం కొలంబియాలో ఉంటున్న ఆమె శనివారం బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ మార్గమధ్యంలో జలపాతం వద్ద ఆగారు. 
 
కొద్దిసేపు జలపాతం అందాలు తిలకించిన ఆమె.. ఆ తర్వాత సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం సహకారంతో కమల మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు