సుస్తి చేస్తే బాగు చేయాల్సిన దావఖానాల్లోనే మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మహిళపై ఓ సెక్యూరిటీ గార్డు లైంగిక దాడికి పాల్పడ్డాడు. రోగికి సహాయంగా ఉండేందుకు వెళ్లగా, ఈ దారుణం జరిగింది. ఈ విషయం తెలిసిన సహచర సెక్యూరిటీ సిబ్బంది ఈ దారుణాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. అయితే, బాధితురాలు నోరు తెరవడంతో ఈ లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యం కారణంగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి సహాయంగా ఉండేందుకు ఓ మహిళ(35) వెళ్లింది. శనివారం అర్థరాత్రి దాటాక అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీగార్డు ఆమెకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లాడు. గాంధీ మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న క్రీడా మైదానంలో లైంగికదాడికి పాల్పడినట్టు సమాచారం.