కియా ప్లాంట్.. గురువారం ఉదయం నుంచి ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ హాట్‌టాపిక్‌గా మారింది. ‘కియ ప్లాంట్ తమిళనాడుకు తరలిపోతోంది.. తమిళనాడు ప్రభుత్వ అధికారులతో కియా యాజమాన్యం సంప్రదింపులు జరుపుతోంది’ అంటూ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ ప్రచురించిన కథనంతో ఏపీలో కలకలం మొదలైంది.