రామ్ చరణ్ అత్త ఓటు గల్లంతు.. మండిపడిన ఉపాసన

గురువారం, 11 ఏప్రియల్ 2019 (14:25 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్త శోభనా కామినేని ఓటు గల్లంతైంది. గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు శోభనా కామినేని అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. తీరా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లి చూడగా ఓటరు జాబితాలో ఆమె పేరు లేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమె అపోలో ఆస్పత్రి యజమాని డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి కుమార్తె. 
 
తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు విదేశాల నుంచి వస్తే, ఓటు గల్లంతైందంటూ శోభనా కామినేని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గురువారం ఉదయం ఓటేసేందుకు ఓటరు కార్డును తీసుకెళ్లిన ఆమెకు, ఓటు లేదని, దాన్ని తొలగించారని, ఎందుకు తొలగించారన్న కారణం తమకు తెలియదని ప్రిసైడింగ్ అధికారులు తెలిపారు. 
 
దీంతో ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, దేశ పౌరురాలినైన తనకు ఇదో విచారకరమైన రోజని అన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని సహించబోనని హెచ్చరించారు. కాగా, చేవెళ్ల నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా శోభన సమీప బంధువేనన్న సంగతి తెలిసిందే. 
 
ఈ దీనిపై ఆమె కుమార్తె, సినీ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన మండిపడ్డారు. 'మా అమ్మ శోభన ఈరోజు ఓటు వేయలోకపోయారు. 10 రోజుల క్రితం ఓటరు లిస్టులో ఆమె తన పేరును చెక్ చేసుకున్నారు. అప్పుడు ఓటు ఉంది. ఇప్పుడు దాన్ని తొలగించారు. దేశానికి ఆమె ఎంతో పన్ను చెల్లిస్తోంది. ఆమెను లెక్కలోకి కూడా తీసుకోరా? భారతీయ పౌరురాలిగా ఉండే అర్హత ఆమెకు లేదా?' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.

 

My mom @shobanakamineni wasn’t able to vote today. She checked 10 days ago and her name was on the list ! Now it’s deleted !! She pays Tax !doesn’t she count ? Isn’t she valued as an Indian citizen ? #frustrated #furious #disappointed pic.twitter.com/BcWpql5lru

— Upasana Konidela (@upasanakonidela) April 11, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు