వివరాలలోకి వెళ్తే... చిన్నలింగపూర్ గ్రామానికి చెందిన చేప్యాల కనకయ్య-కనకవ్వ దంపతుల మూడవ కుమార్తె చేప్యాల రేణుక (20) సిద్దిపేట జిల్లా కేంద్రంలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. ఆదివారం రాత్రి తల్లిదండ్రులు కూతుళ్ల పెళ్లిళ్ల విషయం గురించి చర్చిస్తూండగా రేణుక తనకూ పెళ్లి చేయాలని తల్లి దండ్రులను కోరింది.