విజయనగరం జిల్లా గుడివాడలో కొందరు పోకిరీలు ఓ మహిళా ఎస్‌ఐను జట్టుపట్టుకుని చితకబాదారు. స్థానికంగా జరిగిన ఓ జాతరలో కొందరు పోకిరీలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగారు. ఈ విషయాన్ని అక్కడ విధుల్లో ఉండే ఓ మహిళా ఎస్ఐ గుర్తించి, మందలించారు. దీంతో ఆ పోకిరీలంతా కలసి ఆ ఎస్ఐను చుట్టుముట్టి, జట్టుపట్టుకుని కొట్టడంతో ఆమె ప్రాణభయంతో పరుగులు చేశారు. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
దీంతో ఆమె వారి నుంచి తప్పించుకుని ప్రాణభయంతో పరుగులు తీశారు. సమయంలోని ఓ ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నారు. అయినా వదలని ఓ పోకిరీలు అక్కడికి వెళ్లి నానా రభస చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోకిరీల దాడిలో ఎస్ఐకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మొత్తం 9 మంది నిందితులను అరెస్టు చేశామని మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.