సహాయక చర్యలను వేగవంతం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే, జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు.
కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తిరుపతిలోని స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రుల్లో చేర్చించి చికిత్స అందిస్తున్నట్టు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేయాలని సీఎం జగన్ చెప్పారని తెలిపారు.