ఆధార్, డీటెయిల్స్ ఎవరిదగ్గర ఉండకూడదు. అవి ఏ రకంగా ఐటీ గ్రిడ్‌లో కనిపిస్తున్నాయి. ఆధార్ వివరాలు టీడీపీ సేవ మిత్ర యాప్‌లో ప్రైవేట్ కంపెనీలో కనపడటం నేరం కాదా అని ప్రశ్నించారు. ఓటర్ లిస్ట్ మాస్టర్ కాపీ ఏవిధంగా ఐటీ గ్రిడ్, టీడీపీ సేవ మిత్ర యాప్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రజల బాంక్ ఎకౌంట్ వివరాలు ఇట్ గ్రిడ్, టీడీపీ సేవ మిత్ర యాప్‌లో ఉన్నాయి. రేపు మీ అంతట మీరే ఏమి చేసినా, ప్రజలు మోసపోరా... నాశనం అయిపోరా అన్నారు.
గత ఎన్నికల్లో మాకు టీడీపీకి ఓట్ల తేడా ఒక్క శాతం. ఎన్నికల సంఘం చేసే విచారణకు మేము సహకరిస్తుంటే... సీఎం పోలీసులను ఉపయోగించి ఫార్మ్ 7 అప్లై చేసిన వారిని హరాస్ చేస్తున్నారు. రెండేళ్లుగా చంద్రబాబు చేస్తుంది తప్పు... ఫార్మ్ 7 అప్లై చేయడం తప్పు. ఆధార్ డేటా, బ్యాంక్, ఓటరు ఐడి డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంటే అది నేరం. ప్రైవేట్ వ్యక్తులకు డేటా చోరీ చేసి ఇచ్చిన వ్యక్తి సీఎంగా ఉండటానికి అర్హుడేనా? చంద్రబాబు, ఆయన కొడుకుని జైల్లో పెట్టాలి. నేరం ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు. చేసేది తప్పు.. దానిని ఆంధ్ర, తెలంగాణ గొడవ కింద తప్పు దోవ పట్టిస్తున్నారు అన్నారు.