అచ్చెన్నాయుడు అరెస్టుపై ఆయన స్పందిస్తూ, అచ్చెన్నాయుడే కాదు.. ఏ రాజకీయ నాయకుడైనా నిజంగా తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. సీఎంకు తప్ప ఎవరికీ ఏసీబీ ముందుగా తెలియజేయదన్నారు. టీడీపీ నేతలు రోజుకు ఒకరు అరెస్ట్ అవుతారని, మంత్రులు అనడం సరికాదన్నారు.
అలాగే, అచ్చెన్నను పరామర్శించడానికి చంద్రబాబును అనుమతించకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనే. పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు జగన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రతిపక్షానికి నచ్చక పోవడం వల్లే కోర్టులను ఆశ్రయించారని గుర్తుచేశారు.