ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ 25 ఎంపీ సీట్లకు గాను ఏకంగా 22 సీట్లను కైవసం చేసుకోవడం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఘనవిజయానికి నిదర్శమన్నారు. ఇపుడు తొడగొట్టి చెబుతున్నాం... వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో 25కు 25 లోక్‌సభ సీట్లను గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అదేసమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజన్న పాలన ప్రారంభమైందనీ, సీఎం జగన్ అవినీతిరహిత పాలన అందిస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రజారంజక పాలన అందించేలా జగన్ నిర్ణయాలు ఉండబోతున్నాయన్నారు. జగన్ ఆలోచనలకు అనుగుణంగా పార్లమెంటులో వైసీపీ సభ్యులు నడుచుకుంటారని ఆయన తెలిపారు.
కాగా, ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో 175 అసెంబ్లీ సీట్లకు గాను వైకాపా 151 శాసనసభ సీట్లను, 25 ఎంపీ సీట్లకు గాను 22 ఎంపీ సీట్లను గెలుచుకున్న అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెల్సిందే.