హెలికాఫ్టర్ దెబ్బకు ఫ్యాన్ బెంబేలు... గుర్తు మార్చాల్సిందేనంటూ వైకాపా డిమాండ్

గురువారం, 28 మార్చి 2019 (20:44 IST)
ప్రజాశాంతి పార్టీ హెలికాఫ్టర్ గుర్తును చూసి వైకాపా నేతలు బెంబేలెత్తిపోతున్నారు. హెలికాఫ్టర్ గుర్తు, తమ ఎన్నికల గుర్తు అయిన ఫ్యాన్ గుర్తు ఒకేలా ఉన్నాయనీ, అందువల్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రజాశాంతి గుర్తును మార్చాలని వైకాపా నేతలు కోరుతున్నారు. 
 
అలాగే, ఏపీలో అధికారులు వ్వహరిస్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందచేశారు. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను విధుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వివిధ అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతి పత్రం సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోనందున మరోసారి కలిశామని ఆ పార్టీ నేతలు చెప్పారు. 
 
టీడీపీకి అనుకూలంగా పని చేసే విధంగా పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసు వాహనాల్లోనే డబ్బును నియోజకవర్గాలకు చేరవేస్తున్నారని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీకి కేంటాయించిన హెలిక్యాప్టర్ గుర్తును మార్చమని కోరినట్టు ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు