న్యాయ వ్యవస్థ తీరు అభ్యంతరకరంగా ఉంది.. వైకాపా ఎమ్మెల్యే

శుక్రవారం, 4 మార్చి 2022 (12:45 IST)
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైకాపా ఎమ్మెల్యే  కోరుముట్ల శ్రీనివాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు న్యాయ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పుపై వైకాపాకు చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 
 
రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పే హక్కు న్యాయ వ్యవస్థకు లేదన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయమన్నారు. అసెంబ్లీని న్యాయ వ్యవస్థ శాసించడం దారుణమన్నారు. 
 
ఇలాంటి నిర్ణయాలు తిరిగి న్యాయ వ్యవస్థనే కాటేస్తాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారన్నారు. కోట్లాది మంది ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజల అవసరాలకు తగ్గట్టుగానే పాలన ఉంటుందని ఆయన అన్నారు. ప్రజా పాలనను దెబ్బతీసే విధంగా దుష్ట శక్తులు వ్యవహరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు