అమరావతిలో జరుగుతున్న పార్లమెంటేరియన్ల సదస్సుకు వెళ్ళిన వైకాపా ఎమ్మెల్యే రోజాను గన్నవరం విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు పోలీసులు. ఆమెను గుంటూరు జిల్లా వైపు తరలించారు. ఈ క్రమంలో పోలీస్ జీపు పేరేచర్ల చేరుకుంది. పేరేచర్ల సెంటర్లో ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద పోలీస్ జీపు నుంచి రోజా దూకేశారు. అంతేకాదు, కాపాడండి అంటూ కేకలు వేసుకుంటూ రోడ్డుపై పరుగులు తీశారు. ఆమెను వెంబడించి పట్టుకున్న పోలీసులు మళ్లీ పోలీస్ వాహనం ఎక్కించారు. ఆ తర్వాత పోలీస్ జీపు సత్తెనపల్లి వైపుగా బయల్దేరింది.
రోజా వల్ల మహిళా పార్లమెంట్ సదస్సుకు ఇబ్బంది కలుగుతుందనే ముందస్తుగా అదుపులోకి తీసుకుని, హైదరాబాద్కు తరలిస్తున్నామని డీజీపీ వెల్లడించారు. మహిళా పార్లమెంట్ సదస్సులో వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని రోజా హామీ ఇస్తే సదస్సుకు అనుమతించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.